Ambajipeta Marriage Band Trailer: పరువు తీసినోడికి..ఆ పరువుతోనే దెబ్బకొట్టాలా

Ambajipeta Marriage Band Trailer: పరువు తీసినోడికి..ఆ పరువుతోనే దెబ్బకొట్టాలా

సుహాస్(Suhas) హీరోగా దుశ్యంత్ కటికినేని( Dushyanth Katikaneni) దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్, వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band ). శివాని నాగరం హీరోయిన్ గా నటిస్తుంది. శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్ర పోషిస్తుంది 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇందులో సుహాస్ ఓ వైపు కటింగ్‌ షాప్‌, మరోవైపు బ్యాండు వాయిస్తుంటాడు. సరదాగా ఫ్రెండ్స్ తో గడుపుతూ..హీరోయిన్ కి మధ్య ఉన్న క్యూట్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నువ్వు అబ్బాస్ ఫ్యాన్ కదా..లేదండీ అతని కటింగ్ కు ఫ్యాన్. అలాగే సుహాస్ ఆ ఊరిలో ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చిన అన్నింటిని తనమీద వేసుకుని బ్ర‌తుకుతూ ఉంటాడు.

అయితే అనుకోకుండా అత‌డు పెద్దింటి అమ్మాయి ల‌క్ష్మితో ప్రేమ‌లో ప‌డుతాడు. ఊర్లో కులాలు, వర్గాల మధ్య పోరాటంలా మారుతుంది అంబాజీ పేట. అలాగే సుహాస్ ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి కోసం తన అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? పరువు తీసినోడికి..ఆ పరువుతోనే దెబ్బకొట్టాలా..అనే డైలాగ్స్ స్టోరీపై ఆసక్తి కలిగేలా చేస్తోంది. చివరికి అక్క‌ కోసం సుహాస్ ఏం చేశాడు? మన ప్రేమ..నీ ప్రాణం మీదికి తేకూడదు మల్లి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఎంతో ఆర్ద్రతను తెలియజేస్తుంది.

ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ కొట్టడం కన్ఫమ్ అనేలా ఉంది.శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది.