సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదాల రూపొందించిన  చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’.  హరీష్ నల్ల నిర్మించిన ఈ చిత్రంలో  దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో నటించారు. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత కీలకపాత్ర పోషించగా అలీ,  ప్రభాస్ శ్రీను, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జులై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు.  రానా దగ్గుబాటి  స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. 

రిలీజ్ డేట్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక క్యూట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీ. ప్రతి ఫ్రేమ్ కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.  సుహాస్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లస్‌‌‌‌‌‌‌‌. రామ్‌‌‌‌‌‌‌‌గా సుహాస్‌‌‌‌‌‌‌‌, సత్యభామగా మాళవిక మనోజ్‌‌‌‌‌‌‌‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు’ అని చెప్పాడు. ఈ చిత్రం అందర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా ఉంటుందని, సుహాస్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు అన్నారు.  రథన్ సంగీతం అందిస్తున్నాడు.