టిక్ టాక్ లో ప్రేమ.. నో అన్నందుకు సూసైడ్​ అటెంప్ట్​

టిక్ టాక్ లో ప్రేమ.. నో అన్నందుకు సూసైడ్​ అటెంప్ట్​

టిక్ టాక్ లో ప్రేమ.. నో అన్నందుకు సూసైడ్​ అటెంప్ట్​
హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ ఠాణాలో బ్లేడ్​తో కోసుకున్న​ యువతి

హైదరాబాద్, (జూబ్లీహిల్స్), వెలుగు: వారిద్దరూ టిక్ టాక్ లో పరిచయమయ్యారు.. ప్రేమించుకున్నారు.. అబ్బాయి ఆమెను దూరం పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమె బ్లేడ్​తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.. శనివారం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​లో ఈ ఘటన జరిగింది. ఏపీలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఓ యువతి, హైదరాబాద్ లో డ్రైవర్ గా ఉద్యోగం చేసే వీరబాబు ఇద్దరూ టిక్ టాక్ లో పరిచయమయ్యారు. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారింది. కానీ వీరబాబు కొద్దిరోజులుగా ఆమెను  దూరం పెట్టాడు. దీంతో రెండు రోజుల కింద ఆ యువతి జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​కు వచ్చి వీరబాబుపై ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదంటూ శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​ ముందు బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమెను వెంటనే ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు.

టిక్​టాక్​వీడియో చేసి మరీ..

ఆమె బ్లేడుతో చేయికోసుకోవడానికి ముందు కూడా ఓ వీడియో తీసి వీరబాబుకు పంపినట్టు తెలిసింది. వీరబాబును విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉందని, పేరెంట్స్​ఏదైనా అంటే ఊరుకోవాలని, తాను లేకున్నా సంతోషంగా ఉండాలంటూ వీడియోలో పేర్కొన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తల కోసం