కీళ్ల బలానికి సూక్ష్మ యోగ

కీళ్ల బలానికి సూక్ష్మ యోగ

కదలికలు లేకుంటే.. శరీరం కూడా పాడుబడ్డ బండిలెక్కనే తయారైతది. జాయింట్లు గట్టిగ లేకుంటే చిన్న గాయం కూడా పెద్ద ప్రమాదమై కూసుంటది.  అందుకే జాయింట్లు గట్టిగా ఉండాలె. అక్కడ ఉండే శక్తి కేంద్రాలను ఉత్తేజ పరచాలె. దీనికి సూక్ష్మ యోగకు మించిన టెక్నిక్‌ లేదు. అంతేనా,  దీంతో ప్రాణశక్తి కూడా పెరుగుతది. ఇతర ఆసనాలు, ఎక్సర్‌‌సైజ్‌లతో పోలిస్తే.. సూక్ష్మ యోగ చెయ్యడం చాలా సులభం. సూక్ష్మ యోగకు  ఎవరి సాయం అక్కర్లేదు! నిలబడి.. కూర్చొని  ఎట్లైన చేయొచ్చు.

కుడి నుంచి ఎడమకు మెడను తిప్పాలి. అలాగే ఎడమ నుంచి కుడికి తిప్పాలి. తర్వాత తలను సవ్య​, అపసవ్య దిశలో​ మొత్తం… రెండువైపులా పదిసార్లు చెయ్యాలి. మెడ తిప్పేటప్పుడు కళ్లు మూసుకోవడం మర్చిపోవద్దు.

లాభాలు

వామప్‌ లేకుండా ఆసనాలు లేదా ఇతర ఎక్సర్‌‌సైజులు చేయకూడదు. అలా చేస్తే గాయాల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఈ సూక్ష్మ యోగ మంచి వామప్‌లా పని చేస్తుంది. వీటిని ఒక్కొక్కటి ఇరవైసార్ల వరకు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. చాలాసేపు కూర్చున్నప్పుడు… చాలా సేపు పడుకున్నప్పుడు వెంటనే సూక్ష్మ యోగా చేస్తే రిఫ్రెష్ అవుతారు.

నమస్కార ముద్రలో.. అన్ని చేతి వేళ్లు ఒక దానితో మరొకటి కలిసేట్టుగా పదిసార్లు చప్పట్లు కొట్టాలి. నిటారుగా నిలబడి, పాదాలను దగ్గరకు తీసుకురావాలి. తర్వాత మోకాళ్లను ఒకదానికి మరొకటి ఆనించి ఇరవైసార్లు సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి.  చెవులను రెండు చేతులతో పట్టుకుని.. అటుఇటూ తిప్పాలి. ఇలా చెవులు వేడెక్కే  వరకు తిప్పాలి.  బొంగరాన్ని తిప్పినట్టు..కనుగుడ్లను 56 సార్లు.. సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి. మధ్యమధ్యలో కొద్దిసేపు విరామం తీసుకున్నా పర్వాలేదు. కళ్లను గట్టిగా మూయాలి. తర్వాత సాధ్యమైనంత వెడల్పుగా కళ్లు తెరిచి చూడాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి. మెల్లిగా గాలి పీల్చుకుంటూ నోటిని వీలనైంతగా చాచి.. గాలి వదులుతూ నోటిని ముయ్యాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.