విక్టర్ ది నెక్స్ట్ గాడ్ మూవీ టైటిల్ లోగో లాంచ్

విక్టర్ ది నెక్స్ట్ గాడ్ మూవీ టైటిల్ లోగో లాంచ్

రెండొందల మంది కొత్త నటీనటులతో దర్శకుడు ప్రీతమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్టర్ ది నెక్స్ట్ గాడ్’.  అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్  బ్యానర్‌‌‌‌పై వడ్లపట్ల చౌదరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ లోగోను సుమన్ లాంచ్ చేసి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.  దర్శకుడు ప్రీతమ్ మాట్లాడుతూ ‘ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ.  నాలుగు కోట్ల బడ్జెట్‌‌తో రూపొందిస్తున్నాం. 

ఏడు దేశాల్లో షూట్ జరగనుంది. అన్ని దేశాల నటులను కలుపుకుని దాదాపు రెండొందల మందిని ఈ సినిమా కోసం తీసుకున్నాం’ అని చెప్పాడు.  కొత్తదనం కలిపిన మంచి సబ్జెక్ట్‌‌ను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు నిర్మాత.  లయన్ వెంకట్, చిగోటి ప్రవీణ్,  వేణుగోపాలాచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొని టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.