వేసవి సెలవుల్లో ఇంట్లోనే కూర్చోవాలంటే.. ఆడుకునే పిల్లలకు ఎలా ఉంటుందో ఊహించండి. వాళ్లు చాలా బోర్ ఫీల్ అవుతారు. అది పిల్లల మనసుపై ప్రభావం చూపిస్తోంది. ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. పిల్లలకు బోర్ పోగొట్టాలంటే కొన్ని యాక్టివిటీస్ చేయించాలి.
ఏడాదిన్నర పిల్లలు కూడా బయటకు వెళతామని మారాం చేస్తారు. వీకెండ్స్ వాళ్లను సరదాగా బయటికి తీసుకెళ్లాలి. కాని ఎండలు మండిపోతున్నాయి. దీంతో పిల్లల్ని ఆడుకునేందుకు బయటికి పంపేందుకు కూడా భయపడుతున్నారు.
పిల్లలు అంటే ఒకచోట ఉండరు. సెలవు వచ్చిందంటే వెళ్లి బయట ఆడుకోవడం -మాత్రమే వాళ్లకు తెలుసు. వీకెండ్ లో బయటికి తీసుకెళ్లమని మారాం చేస్తారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లను బయటికి తీసుకెళ్లడం కుదరదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోతున్నాయి.
పెద్దోళ్లతో పాటు పిల్లల్లో కూడా ఎండ అంటే భయం కలుగుతుంది. కాబట్టి వాళ్లను మెంటల్ స్ట్రాంగ్ గా ఉంచాలి. పాటించాల్సిన జాగ్రత్తల గురించి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి.
వాళ్లు చెప్పే కబుర్లు వినాలి: పిల్లలు చెప్పే కబుర్లు విసుక్కోకుండా వినాలి. వాళ్లలో భయం కనిపిస్తే దాన్ని పోగొట్టేలా కథలు చెప్పాలి. వాళ్లతో కలిసి ఆడుకోవడం లాంటివి చేయాలి. నిద్రపోయేటప్పుడు వాళ్ల పక్కనే ఉంటూ కథలు చదవడం, చదివించడం లాంటివి చేస్తూ నిద్రపుచ్చాలి.
ఫ్రెండ్స్ తో మాట్లాడించాలి: ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదు. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు వాళ ఫ్రెండ్స్ వీడియో కాల్ మాట్లాడించడం లాంటివి చేయాలి. వర్చువల్ గా ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడుకునేలా అరేంజ్ చేస్తే పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు.
అనుమానం తీర్చాలి: పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగితే అనుమానాలు క్లియర్ చేయాలి. పరిస్థితులను వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి. ఈ టైంలో ఎలాంటి పనులు చేయాలి? ఏం చేయకూడదు! అనే విషయాల్ని చెప్పాలి. అలా ఎందుకు. ఉండాలో కూడా అర్థమయ్యేలా చెప్పాలి.
యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి: పిల్లలు చాలా బోర్ ఫీల్ అవుతారు. వాళ్ల బోర్ పోగొట్టాలంటే ఇంట్లోనే యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. పిల్లల ఇంట్రెస్ట్ ను బట్టి వాటిని ప్లాన్ చేయాలి. దాంతో పాటు తోటపని, వంట చేయడం లాంటివి కూడా అలవాటు చేస్తే కొత్తగా ఉంటుంది.
