రెజ్లర్ కథతో సుమో దీదీ

రెజ్లర్ కథతో సుమో దీదీ

భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందిన చిత్రం ‘సుమో దీదీ’.  జయంత్ రోహత్గి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియం భగ్నాని  ప్రధాన పాత్రలో నటించగా, చైతన్య శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.  

జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, ఎమ్‌‌ఏ ప్లస్ టీహెచ్  ఎంటర్‌‌టైన్‌‌మెంట్ నెట్‌‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి.  తాజాగా ఈ మూవీ  ట్రైలర్‌‌ను జీ5 హిందీ విడుదల చేసింది.  సమాజంలోని అడ్డంకులను అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేటల్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్టోబర్ 23 నుంచి  జీ5 హిందీలో ఈ సినిమా  స్ట్రీమింగ్ కానుంది.