జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూన్ నెలలో కొన్ని గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి. దీని ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితం మారబోతుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడు.. గురుడు కలిసి ఒకే రాశిలో సంచరించడం వలన రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఆరు రాశుల ( కర్కాటక, సింహ,కన్య, మకర, తుల, మీన ) వారి అదృష్టం మారిపోతోంది. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో వివిధ రకాల రాజయోగాలు ఉంటాయి. ప్రతి రాజయోగానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని యోగాలు శుభప్రదమైనవి. అవి జీవితంలోని కష్టాలను తగ్గిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. జూన్ నెలలో సూర్య, గురు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల 6 రాశుల వారికి అదృష్టం, ధనం, వృత్తిపరమైన శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: గురుడు.. సూర్యుడు కలిసి రాజయోగాన్ని ఏర్పరచుకోవడం వలన ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఒక్కసారిగా ఆర్డర్లు రావడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. విదేశీ వ్యాపారాలు కలసి వస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో మీరే చక్రం తిప్పే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారికి బంధువర్గంలోని వారితో కుదిరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి: గురుడు.. సూర్యుడు కలిసి సంచారం చేయడం వలన రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన ఈ రాశి వారికి అన్ని విధాలా శుభం చేకూరుతుంది. ఇప్పడి వరకు పడిన కష్టాలు ఒక్కసారిగా తీరుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తివివాదాలు పరిష్కారం కావడంతో మనశ్శాంతిగా ఉంటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశాలున్నాయి. పనిభారం పెరిగినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.కెరీర్‌లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా వాటిని సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మెప్పు పొందుతారు. గత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం విపరీతంగా నిండుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు
తులారాశి : జూన్ నెలలో రాజయోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కెరీర్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. రాజయోగం ప్రభావంతో వీరికి స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారికి విశేషమైన గుర్తింపు లభించబోతోంది. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కన్యారాశి: రాజయోగం ఏర్పడటం వలన ఈరాశి వారికి జూన్ నెల చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. రాజకీయనాయకులు పదవీయోగం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ తో బదిలీ అవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు అధికంగాలాభాలు పొందుతారు. జాబ్ కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత, సంతోషం పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి : గరుడు.. సూర్యుడు కలవడం వలన ఈ రాశి వారికి చాలా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. వేతనాల్లో పెంపు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవితభాగస్వామి సలహాలతో కొత్త ప్రాజెక్ట్లు చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ఈ సమయం ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీన రాశి : గురుడు.. సూర్యుడు కలవడం వలన ఈ రాశి వారుఅనుకున్న పనులు అన్నీ సవ్యంగా జరుగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఈ రెండు గ్రహాల కలయిక వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు లక్కు తీసుకొస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అవార్డులు అందుకుంటారు. వృత్తి పరంగా సొంత ఆలోచనలు అమలు చేయడంతో సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులు పొందే లాభాలు ఊహించి ఉండరు. కొత్త బ్రాంచ్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
