న్యూఢిల్లీ: సన్ ఫార్మా అమెరికాకు చెందిన ఆర్గానన్ అండ్ కంపెనీని 11.75 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.02 లక్షల కోట్లు) ఎంటర్‌ప్రైజ్ విలువతో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో షేరును 14 డాలర్ల ధరకు సన్ ఫార్మా దక్కించుకుంటుంది.
దీంతో సన్ ఫార్మా ప్రపంచంలోని టాప్ 25 ఫార్మా కంపెనీల జాబితాలో చేరుతుంది. వార్షిక ఆదాయం సుమారు 12.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2021లో ఎంఎస్ డీ సంస్థ నుంచి విడిపోయిన ఆర్గానన్ మహిళల ఆరోగ్య విభాగంలో గ్లోబల్ లీడర్. ఈ డీల్ వల్ల సన్ ఫార్మా 150 దేశాల్లో తన బిజినెస్‌ను విస్తరించనుంది.

