జ్యోతిష్యం: తులారాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి బంపరాఫర్ టైం వచ్చేసింది..

జ్యోతిష్యం:  తులారాశిలోకి సూర్యుడు..  ఈ రాశుల వారికి బంపరాఫర్ టైం వచ్చేసింది..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  దసరా నవరాత్రి వేళ సూర్యుడు సంచారంలో మార్పు జరుగుతుంది. 2026 అక్టోబర్​ 17న కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి ఈ సంచార మార్పు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఈ సమయం అక్షరాలా కలిసిరానుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . !

 మేష రాశి: సూర్యుడు తులారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలసి వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశం కలుగుతుంది. ఎంతో కాలంగా  ఎదురుచూస్తున్న బాధ్యతలు ..ప్రమోషన్ వచ్చే  అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణ సమ స్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయని పండితులు చెబుతున్నారు . 

 సింహ రాశి: సూర్య సంచారంలో మార్పు వలన ఈ రాశి వారు  కెరీర్‌లో దూసుకుపోయే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతి ఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు  ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమమయని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. ఇతరులను ఆకట్టుకుంటారు.  ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగడం వలన ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో జీవిత భాగస్వామికి, పిల్లలకు అంచ నాలకు మించిన పురోగతి ఉంటుంది.  సహాయ కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా నచ్చుతాయట. . సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. 

కన్యా రాశి:  తులారాశిలో సూర్యభగవానుడి సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక లాభాలుకలిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.  ఉద్యోగస్తుల పనితీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. కొత్తపెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు జాబ్​ వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

తులా రాశి:   సూర్యుడు ఇదే రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి
కెరీర్ లో తిరుగులేని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు దక్కడంతో పాటు అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.   ప్రభుత్వపరంగా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  

మకర రాశి:  సూర్యుడు తులారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.  కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.  ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కెరీర్‌లో ఎదుగుదల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. చేతి వృత్తుల వారికి.. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు వస్తాయి. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు, విదేశీ అవకాశాలకు వీలుంది. విహార యాత్రలు, తీర్థయాత్రలు చేసే సూచనలున్నాయి. ప్రభుత్వపరంగా డబ్బు గానీ, భూమి గానీ అందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి: సూర్య సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి అన్ని రకాల చాలా శుభ పరిణామాలుంటాయని పండితులు చెబుతున్నారు.  ఉద్యోగం కోసం చూస్తున్న వారు గుడ్​ న్యూస్​ వింటారు. కొత్త పరిచయాల వలన , లో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 
ఉద్యోగస్తులకు .. అధికారుల అండదండలు ఉంగాయి.  ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ట్రాన్సఫర్​ అయ్యే అవకాశం ఉంది.  జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.