
కమెడియన్ హర్ష చెముడు(Harsha Chemudu) లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్(Sundaram Master). దివ్య శ్రీపాద(Divya Sripada) హీరోయిన్. కళ్యాణ్ సంతోష్(Kalyan Santosh) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు కలిసి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘సుందరం మాస్టర్ క్లాస్ టైమ్ టేబుల్ లాక్ అయింది’ అంటూ ఫిబ్రవరి 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌తో మెయిన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. మిర్యాల మెట్ట అనే మారుమూల గ్రామంలో ఇంగ్లీషు టీచర్‌గా వెళ్లిన సుందరంకు, ఆ గ్రామస్తులు ఇంగ్లీష్‌లో మాట్లాడి షాకిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది వినోదాత్మకంగా చూపించామంటున్నారు మేకర్స్.