Karikala: ‘శంబాల’ దర్శకుడితో సందీప్ కిషన్.. రెండు చాప్టర్లుగా ఫాంటసీ థ్రిల్లర్

Karikala: ‘శంబాల’ దర్శకుడితో సందీప్ కిషన్.. రెండు చాప్టర్లుగా ఫాంటసీ థ్రిల్లర్

సందీప్ కిషన్ హీరోగా ‘శంబాల’ ఫేమ్  యుగంధర్ ముని దర్శకత్వంలో  మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న చిత్రం ‘కరికాల’.  కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘యుగంధర్ చెప్పిన కథ చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌గా అనిపించింది.  ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. ఈ చిత్రం నా కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు.

దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ ‘అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం అని ఇలా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతోన్నాం’ అని చెప్పాడు.

ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్స్ అన్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ  మొదటి చాప్టర్‌‌‌‌ ను 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.   శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.