సందీప్ కిషన్ నుంచి రాబోతున్న సినిమా ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న మేకర్స్ గురువారం ఫస్ట్ సాంగ్‌ను లాంచ్ చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా ఈ పాటను లాంచ్ చేసి, టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
‘సిగ్మా స్టయిల్’ అంటూ సాగే ఈ పాటను తమన్ కంపోజ్ చేసి పాడాడు. దర్శకుడు జేసన్ సంజయ్ లిరిక్స్ రాశాడు. థమన్ సిగ్నేచర్ స్టైల్ మ్యూజిక్, హై-వోల్టేజ్ రిథమ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. పాటలో సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఫరియా అబ్దుల్లా డాన్స్ ఇంప్రెస్ చేసింది. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 31న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
