Sunil Gavaskar: పాక్ క్రికెటర్కి ఇచ్చే డబ్బుని ఇండియన్స్ చావు కోసమే వాడుతారు..కావ్యపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar: పాక్ క్రికెటర్కి ఇచ్చే డబ్బుని ఇండియన్స్ చావు కోసమే వాడుతారు..కావ్యపై గవాస్కర్ ఫైర్

Sunil Gavaskar: ఇంగ్లాండ్ లో జరగబోయే ‘ది హండ్రెడ్’  లీగ్ వేలంలో నెలకొన్న ఒక పరిణామం ఇప్పుడు భారత క్రికెట్లో తీవ్ర దుమారం రేపుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కు చెందిన ‘సన్‌రైజర్స్ లీడ్స్’ టీమ్, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ. 2.3 కోట్లకు కొనుగోలు చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో జరిగిన ఉగ్రదాడులతో భారత క్రికెట్ ఫ్యాన్స్ సన్ నెట్ వర్క్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోవడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడంతో సన్‌రైజర్స్ లీడ్స్, కావ్య మారన్ పై వస్తున్న విమర్శలపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన సంఘటనల వలనే ఈ విమర్శలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. భారత్, పాకిస్థాన్ మధ్య శత్రుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాకిస్థాన్ క్రికెటర్ పై పెట్టే ఖర్చు (డబ్బు ) చేస్తే పరోక్షంగా ఇండియన్స్ చావు కోసమే ఉపయోగిస్తారని గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఒక పాక్ ప్లేయర్ నీ భారత ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై వచ్చిన ఈ గందరగోళం ఆశ్చర్యకరంగా లేదని సన్నీ అన్నారు. 2008 నవంబర్ లో ముంబై దాడులు జరిగిన తర్వాత ఇండియన్ ఫ్రాంచైజీలు ఐపీఎల్ లో పాకిస్థానీ ప్లేయర్స్ ని పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. పాక్ ఆటగాడికి చెల్లించే డబ్బు నుంచి అతను తన దేశ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కడతాడు.. ఆ డబ్బును ఆయుధాల కొనుగోలు కోసం పాక్ సర్కార్ వాడుకుంటుంది.. చివరకు భారత సైనికులు, పౌరుల ప్రాణాలను తీసేందుకు వాడుతారని సునీల్ గవాస్కర్ వెల్లడించారు.  

ఇండియన్ ఫ్రాంచైజీ అయినా లేదా అనుబంధ జట్టు అయినా కూడా ఓనర్ భారతీయుడు అయితే పాక్ క్రికెటర్ కు ఇచ్చే ఫైసలతో ఇండియన్స్ చావుకు కారణం అవుతారు.. ‘ది హండ్రెడ్’లో జట్టు కోచ్, న్యూజిలాండ్ కు, చెందిన డేనియల్ వెట్టోరికి ఇది అర్థం కాదు.. అందుకే టీమ్ లో పాక్ ప్లేయర్స్ ని కోరుకుంటారు.. కానీ ఓనర్ కావ్య మారన్ దీన్ని అడ్డుకోవాల్సింది.. పోయి దాయాది దేశానికి చెందిన వ్యక్తిని ఎలా కొనుగోలు చేసిందని ప్రశ్నించారు. భారతీయ జీవితాల కంటే టోర్నమెంట్ గెలవడం చాలా ముఖ్యమా? అని గవాస్కర్ క్వశ్చన్ చేశారు.