Dew Date: డిఫెరెంట్ క్యారెక్టర్లో సునీల్.. ‘డ్యూ డేట్’లో పవర్‌ఫుల్ లాయర్‌గా

Dew Date: డిఫెరెంట్ క్యారెక్టర్లో సునీల్.. ‘డ్యూ డేట్’లో పవర్‌ఫుల్ లాయర్‌గా

సునీల్‌‌‌‌ మరో విభిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్‌‌‌‌.కె. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ‘డ్యూ డేట్‌‌‌‌’ చిత్రంలో ఆయన పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ లాయర్‌‌‌‌గా నటిస్తున్నాడు. ఈ పాత్ర తన కెరీర్‌‌‌‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని మూవీ టీమ్ చెబుతోంది.

లోమేష్‌‌‌‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణభగవాన్‌‌‌‌, అక్షర గౌడ, ప్రణీత పట్నాయక్‌‌‌‌, విజ్ఞాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌‌‌‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌‌‌‌ ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో శరవేగంగా జరుగుతోంది. కోర్ట్‌‌‌‌ రూమ్‌‌‌‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం వినోదంతోపాటు అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటుందని నిర్మాతలు తెలియజేశారు.