మెడికల్ మాఫియాపై సన్నీ డియోల్ పోరాటం.. ‘సూర్య’ టీజర్ విడుదల

మెడికల్ మాఫియాపై సన్నీ డియోల్ పోరాటం.. ‘సూర్య’ టీజర్ విడుదల

బాలీవుడ్ మాస్‌‌ హీరో సన్నీ డియోల్ నుంచి వస్తున్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్’.  మలయళ దర్శకుడు ఎం పద్మకుమార్ దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. కమల్ ముకుత్ నిర్మించారు.  సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. ఫ్యామిలీతో సంతోషంగా ఉన్న ఓ మాజీ పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌ జీవితం కూతురి మరణంతో ఒక్కసారిగా మారిపోతుంది. తనదైన శైలి ఇన్వెస్టిగేషన్‌‌తో  ఎలాంటి కేసులోనైనా నిజాల నిగ్గుతేల్చే అతను..  కూతురి మరణం వెనుక ఉన్న రహస్యాలను శోధిస్తాడు.

ఈ ప్రయత్నంలో వైద్య వ్యవస్థలోని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలుస్తాయి. ‘‘అక్కడ డాక్టర్లు మందుల ప్రిస్క్రిప్షన్లు రాయడం లేదు... తమ కమిషన్ల లెక్కలు రాస్తున్నారు. ప్రజలు దీన్ని సహిస్తున్నారు.. కానీ ఇంకా ఎంతకాలం...”అంటూ సన్నీ డియోల్ ప్రశ్నించే సీన్స్‌‌ టీజర్‌‌‌‌కు హైలైట్‌‌గా నిలిచాయి.  నిజాయితీ గల పోలీస్‌‌గా, కూతురి మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రిగా ఎమోషనల్‌‌ సీన్స్‌‌లో  సన్నిడియోల్‌‌ నటన ఆకట్టుకుంది. రవికిషన్, సౌమ్యా టాండన్, జిష్షూ సేన్‌‌గుప్తా, తిను ఆనంద్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  మలయాళ చిత్రం ‘జోసెఫ్‌‌’కు ఇది హిందీ రీమేక్.  నవంబర్ 20న థియేటర్స్‌‌కు వస్తోంది.