భువనేశ్వర్ కాళ్లు మొక్కిన వార్నర్..ఎందుకంటే

భువనేశ్వర్ కాళ్లు మొక్కిన వార్నర్..ఎందుకంటే

సన్‌రైజర్స్ హైదరాబాద్  ఢిల్లీక్యాపిటల్స్ మధ్య జరిగిన  మ్యాచ్లో  ఆసక్తికర  సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్  మొదలవ్వక ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్....సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కాళ్లు మొక్కాడు. మ్యాచులో గెలిచేలా ఆశీర్వదించాలని కోరాడు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ భువీ కాళ్లు మొక్కుతున్న వీడియో వైరల్ అయింది. 

కాళ్లు మొక్కాడు..ఎందుకంటే..

ఏప్రిల్ 24వ తేదీన ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ అనంతరం డేవిడ్ వార్నర్  భువనేశ్వర్ దగ్గరకు వెళ్లాడు. సడేన్ గా అతని  కాళ్లపై పడ్డాడు.  కాళ్లు మొక్కిన వార్నర్ అతన్ని కౌగిలించుకున్నాడు. 

గతంలో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో డేవిడ్ వార్నర్ SRH కెప్టెన్‌గా వ్యవహరించాడు. భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం వార్నర్ ఢిల్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ క్రమంలోనే  సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడేందుకు  ఉప్పల్ స్టేడియానికి వచ్చిన వార్నర్.. భూవీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్ లో పోస్ట్ చేయడంతో  వైరల్ అయ్యింది. 

గెలిచే మ్యాచులో ఓటమి

ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆ తర్వాత 145 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్..20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసింది.