GT vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. గుజరాత్ బౌలర్ల ధాటికి ఏకంగా 32 పరుగులకే కీలకమైన 4 వికెట్లని కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
గుజరాత్ టైటాన్స్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ జట్టు పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండానే తొలి వికెట్ గా ట్రావిస్ హెడ్ గోల్డెన్ డకౌట్ చేయడంతో పాటు ఓవర్ ని కూడా మహమ్మద్ సిరాజ్ మెడిన్ కూడా చేశాడు. దీంతో రెండో ఓవర్ వేసిన కగిసో రబాడ బౌలింగ్ లో ఓ భారీ సిక్సు కొట్టి మంచి ఊపుమీద కనిపించిన ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా హార్డ్ హిట్టింగ్ చేసేందుకు ట్రై చేసి క్లిన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు. కగిసో రబాడ వేసిన 4 ఓవర్లో భారీ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మరన్ రవిచంద్రన్ కూడా నిరాశపర్చాడు. కేవలం 9 పరుగులు చేసి కగిసో బౌలింగ్ లోనే డగౌట్ కి చేరడంతో 32 పరుగులకే కీలకమైన 4 వికెట్లని ఆరెంజ్ ఆర్మీ నష్టపోయింది. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా, సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సమయానికి క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ (7), సలీల్ ఆరోరా (10) కొనసాగుతున్నారు.
Travis Head ✅
— IndianPremierLeague (@IPL) May 12, 2026
Abhishek Sharma ✅
🎥𝗣𝗼𝘄𝗲𝗿𝗽𝗹𝗮𝘆 𝗯𝗿𝗶𝗹𝗹𝗶𝗮𝗻𝗰𝗲 yet again, ft. Mohd. Siraj and Kagiso Rabada 🤝🔥
Updates ▶️ https://t.co/o2tKKCeEaH#TATAIPL | #KhelBindaas | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/umfJ6CrsV5
