LSGvsSRH: మార్కరమ్ వచ్చాడు..బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్

LSGvsSRH: మార్కరమ్ వచ్చాడు..బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్

ఐపీఎల్ 2023లో మరో హాట్ పోరు మొదలైంది. సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్..సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంది. మరోవైపు ఐపీఎల్ 2023ను ఓటమితో ప్రారంభించిన హైదరాబాద్..లక్నోపై విజయం సాధించి పాయింట్ల ఖాతాను తెరవాలని చూస్తోంది. దీనికి తోడు కొత్త కెప్టెన్ మార్కరమ్ ఈ మ్యాచులో బరిలోకి దిగనున్నాడు. మరోవైపు ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచిన లక్నో..రెండో మ్యాచులో చెన్నై చేతిలో పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పై విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని భావిస్తోంది. 

సన్‌రైజర్స్‌ తుది జట్టు :మయాంక్‌ అగర్వాల్‌,అన్ మోల్ ప్రీత్ సింగ్, రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రామ్‌(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్‌, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్‌ మాలిక్‌, ఆదిల్ రషీద్.

లక్నో తుది జట్టు  :  కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య, స్టోయినిస్‌, కైల్‌ మేయర్స్‌, పూరన్‌, రవి బిష్ణోయ్‌, రోమెరియో షెఫర్డ్, ఉనద్కత్‌, అమిత్ మిశ్రా, యష్ ఠాకూర్