యూట్యూబ్‌లో సూపర్ ఏఐ ఫీచర్.. ఇక నోటితో అడిగితే చాలు, కావలసిన వీడియో క్షణాల్లో మీ ముందు!

యూట్యూబ్‌లో సూపర్ ఏఐ ఫీచర్.. ఇక నోటితో అడిగితే చాలు, కావలసిన వీడియో క్షణాల్లో మీ ముందు!

కాలిఫోర్నియాలోని షోర్న్ యాంఫిథియేటర్ కాలో జరిగిన గూగుల్ వార్షిక సదస్సు గూగుల్ ఐ/ఓ 2026లో 'ఆస్క్ యూట్యూబ్' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ ను ప్రకటించారు. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కేవలం వాయిస్ కమాండ్ ఇస్తూ సాధారణ సంభాషణ తరహాలో ప్రశ్నలు అడిగి మనకు కావలసిన వీడియోలను చాలా ఈజీగా వెతుక్కోవచ్చు. యూజర్లు కేవలం నోటితో మాట్లాడి తమకు ఎలాంటి వీడియో కావాలో చెప్తే సరిపోతుంది. ఉదాహరణకు '2026లో బెస్ట్ లాప్ టాప్స్  ఏవి?' అని అడిగినప్పుడు ఏఐ ఆ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంటుంది. ఆ తర్వాత ప్లాట్ ఫామ్లో ఉన్న లక్షల వీడియోల నుంచి వెతికి దానికి అనుగుణంగా లాంగ్ వీడియోలు, షార్ట్స్ రెండింటినీ ఎంపిక చేసి చూపిస్తుంది. సాధారణంగా మనం ఏదైనా వెతికితే వీడియోలు లిస్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ ద్వారా ఏఐ ఆధారిత ఇంటరాక్టివ్ ఆన్సర్లు వస్తాయి. ప్రశ్న అడిగినప్పుడు నేరుగా కొన్ని వీడియోలు చూపించడంతోపాటు టెక్నాలజీ ఆటాపిక్ గురించి చిన్న సారాంశం, ఉపయోగపడే టిప్స్ కూడా అందిస్తుంది. 

ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీడియో మొదటి నుంచి చూడాల్సిన అవసరం లేకుండా మన ప్రశ్నకు సంబంధించిన అసలు భాగం ఎక్కడ ఉందో ఏఐ గుర్తించి నేరుగా అక్కడికే తీసుకెళ్తుంది. ఇది ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగ పనిచేస్తుంది. ఒక ప్రశ్న అడిగి సమాధానం వచ్చిన తర్వాత దానికి లింక్ చేస్తూ మరిన్ని ఫాలో అప్ ప్రశ్నలు అడిగి రిజల్ట్స్ మార్చుకోవచ్చు. గూగుల్ తయారుచేసిన అత్యంత వేగవంతమైన జెమిని 3.5 ఫ్లాష్ ఏఐ మోడల్ బ్యాక్ గ్రౌండ్లో పనిచేస్తూ ఈ సెర్చ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. యూట్యూబ్లో వీడియోలు వెతికే పద్దతిని పూర్తిగా మార్చేస్తూ గూగుల్ తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఏఐ ఫీచర్ యూజర్ల టైం సేవ్ చేస్తుంది. 

దీనిని ఎనేబుల్ చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేసి యూట్యూబ్ యాప్ లో లేటెస్ట్ వెర్షన్ ని  అప్ డేట్  చేయాలి. ఆ తర్వాత మొబైల్ బ్రౌజర్లో యూట్యూబ్ న్యూ ఫీచర్స్ పేజీ ఓపెన్ చేయొచ్చు. నేరుగా యూట్యూబ్ యాప్ ప్రొఫైల్ ఐకాన్ నొక్కి ప్రీమియం బెనిఫిట్స్ ఆప్షన్లోకి వెళ్లొచ్చు. అక్కడ కనిపించే ట్రై ఎక్స్పరిమెంటల్ న్యూ ఫీచర్స్ క్లిక్ చేస్తే కొత్త ఫీచర్ల లిస్ట్ ఓపెన్ అవుతుంది.ఆ లిస్ట్ లో ఆస్క్ యూట్యూబ్ లేదా కన్వర్సేషనల్ సెర్చ్ ఆప్షనన్ ని వెతికి దాని కింద ఉండే ట్రై ఇట్ అవుట్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ యాక్టివేట్ చేసిన తర్వాత ఉపయోగించడం కూడా చాలా తేలిక. యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ క్లిక్ చేయగానే పక్కన కొత్తగా ఆస్క్ యూట్యూబ్ బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ నొక్కి మైక్రోఫోన్ ద్వారా మీకు కావలసిన వీడియో గురించి సాధారణ వాడుక భాషలో మాట్లాడి అడగొచ్చు. కేవలం సెర్చ్ చేయడమే కాకుండా ఏదైనా వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద కనిపించే స్టార్ ఐకాన్ లేదా ఆస్క్ బటన్ నొక్కి ఆ రన్నింగ్ వీడియోకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకోవచ్చు.