హెయిర్ స్పా వల్ల జుట్టుకి పోషణ అంది వా కుదుళ్లు బలంగా అవుతాయి. జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. అందుకే వారానికోసారైనా హెయిర్ స్పా చేసుకోవాలి. స్పా కోసం ప్రతిరోజూ పార్లరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఉండే నేచురల్ ఇంగ్రెడియెంట్స్ తోనే హెయిర్ స్పా చేసుకోవచ్చు.
గుడ్డుతో..
కావాల్సినవి:
- ఆలివ్ ఆయిల్ -రెండు టేబుల్ స్పూన్లు
- తేనె- రెండు టేబుల్ స్పూన్లు
- వేడినీళ్లు- ఒక గిన్నెడు
- కోడిగుడ్డు తెల్ల సొన - రెండు కప్పులు
- టర్కీ టవల్-ఒకటి
తయారీ
గిన్నెలో కోడిగుడ్డు తెల్ల సొన, తేనె, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. తర్వాత టర్కీ టవల్ని వేడినీళ్లలో ముంచి, బాగా పిండి తలకు చుట్టాలి. పదినిమిషాలయ్యాక ఆ మిశ్రమాన్ని తలకు ప్యాక్ లా వేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలను శుభ్రం చేయాలి. ఇవ్వడంతో పాటు జుట్టు ఈ హెయిర్ స్పా తలకు చల్లదనాన్ని మెరిసేలా చేస్తుంది.
►ALSO READ | మైదా బదులు అరటి పిండితో... బోలెడు వంటలు చేసుకోవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!
అలాగే పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకుని పైన చెప్పిన ప్రాసెస్లో తలకి పట్టించినా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల చుండ్రు, దురద సమస్యలు తగ్గుతాయి. అయితే స్పా తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూలతోనే తలస్నానం చేయాలి. అలాగే స్ట్రెయిట్నర్ లాంటి ప్రొడక్ట్స్ వాడకూడదు.
