సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ జంటగా మల్లిక్ రామ్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. జులై 2నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా వస్తున్న ఈ కథ మాకిపూర్ గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా చేరిన సుబ్బు చుట్టూ సాగుతుంది.
అవగాహన కల్పించేందుకు వచ్చిన సుబ్బు (సందీప్ కిషన్) అనుకోని సంఘటనలు, హాస్యభరిత పరిస్థితులు, వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటాడు. కామెడీతో పాటు కుటుంబ బంధాలు, సంబంధాల వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించే ఈ సిరీస్‌లో మురళీ శర్మ, గెటప్ శ్రీను, బ్రహ్మానందం, మానస చౌదరి కీలక పాత్రలు పోషించారు. హాస్యం, భావోద్వేగాలతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుందని మేకర్స్ తెలియజేశారు.
