Rana Daggubati: రానా రాక్షస రాజాలో..సూపర్ స్టార్! కథేంటో తెలుసా?

Rana Daggubati: రానా రాక్షస రాజాలో..సూపర్ స్టార్! కథేంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో రానా(Rana), దర్శకుడు తేజ(Teja) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి (Nene Raju Nene Mantri). పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు..చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న దర్శకుడు తేజ ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా సాధించిన విజయంతో..నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సీక్వెల్గా వస్తున్న రాక్షస రాజా స్టోరీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో రానాతో పాటుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) కూడా నటిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో రానా బావ క్యారెక్టర్లో మోహన్ లాల్ కనిపిస్తారని తెలుస్తుంది. రాక్షస రాజు సినిమా కథ కూడా బావా బామ్మర్దుల కథతోనే తెరకెక్కిస్తున్నరట డైరెక్టర్ తేజ. ఇక ఈ సినిమా మెయిన్ థీమ్ కి వస్తే..బావ ఆనందం కోసం ఏదైనా చేసే బామ్మర్ది క్యారెక్టర్ లో రానా కనిపిస్తారట. బావకి అధికారం కట్టబెట్టి ఆయన కళ్లల్లో ఆనందం చూసేందుకు..ఎంతకైన  తెగించే బామ్మర్దిగా ఏదైనా చేస్తాడట. ఈ కథతోనే రాక్షస రాజు తెరకెక్కుతున్నట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్. 

రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో రానా లుక్ నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారు. చేతిలో మిషన్ గన్ పెట్టుకొని, నుదుటన నామాలతో, నోట్లో చుట్టతో చాలా పవర్ ఫుల్గా కనిపిస్తున్నారు రానా. ఈ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. మరి రానా ఇంటెన్స్కి సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన తోడైతే వెండితెర హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోండి. త్వరలో మేకర్స్ ఈ కాంబోపై ఆఫీసియల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.