నేడు సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ‌శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

నేడు సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ‌శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ఒక మామూలు కండక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ శనివారం తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన తాజాగా రాజకీయ పార్టీని కూడా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఆ పార్టీకి సంబంధించిన విధివిధానాలు డిసెంబర్ 31న వెల్లడిస్తానని ఆయన తెలిపారు. త్వరలోనే రజనీ రాజకీయంలోకి అడుగుపెట్టబోతున్నారు. దాంతో రజినీ పుట్టినరోజు ఆయన అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. రజినీ అభిమానులు ఈ ఉదయం చెన్నైలోని ఆయన నివాసం ముందు బ్యానర్లు, రజినీ ఫోటోలు పట్టుకొని నినాదాలు చేశారు. రజినీ మక్కల్ మండ్రంకు చెందిన నాయకులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆయన డిసెంబర్ 12, 1950లో బెంగుళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. రజినీకాంత్ 1975లో తమిళంలో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం పార్టీకి (ఎఐఎడిఎంకె) సమన్వయకర్తగా ఉన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం.. రజనీకాంత్‌కు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

సంగీతదర్శకుడు ఏఆర్. రెహమాన్.. రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దానికి రజినీ ఫోటోను జతచేశారు.

రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ముందుముందు మంచి జీవితాన్ని గడపాలి. మీకు మరిన్ని విజయాలు దక్కాలి. మీ రాజకీయ జీవితం కూడా సక్సెస్ కావాలి. మీ స్టైల్‌తో మిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. మీరు ఎంచుకున్న మార్గం ద్వారా మిమ్మల్ని అభిమానించే మిలయన్ల మందికి సేవ చేస్తారని నమ్ముతున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

For More News..

మధ్యాహ్నం రాజీనామా.. కేటీఆర్ ఫోన్ కాల్‌తో రాత్రి విత్ డ్రా

నాగార్జునసాగర్ పై గులాబీ సర్వే.. బైపోల్‌ కోసం పక్కా వ్యూహం

అన్​నోన్​ యాప్స్ తో జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలోఅయితే చాలు..