
ఇప్పుడు ప్రతి ఇంట్లో వాటర్ గీజర్లు పెట్టించుకుంటు న్నారు. అయితే.. చాలామంది పొరపాటుగా గీజర్ ట్యాప్ అన్ చేసి నీళ్లలో చెయ్యి పెట్టేస్తుంటారు. అవి బాగా వేడిగా ఉంటే చేతికి బొబ్బలు రావడం ఖాయం. అలాంటప్పుడు ఈ టెంపరేచర్ కలర్ ఫాసెట్ని బిగించుకుంటే సరిపోతుంది. దీన్ని స్పాప్లీ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులోని లైట్ కలర్.. నీళ్ల టెంపరేచర్ని బట్టి మారుతుంటుంది. టెంపరేచర్ 32 డిగ్రీల లోపు ఉంటే నీలం, 33–41 డిగ్రీల మధ్య ఉంటే ఆకుపచ్చ, 42–45 డిగ్రీల మధ్య ఉంటే ఎరుపు రంగులో లైట్ వెలుగుతుంది.
టెంపరేచర్ 46 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఎరుపు రంగు ఫ్లాష్ అవుతుంటుంది. ఇలా లైటు రంగుని బట్టి నీళ్ల వేడిని గుర్తించొచ్చు. ఇది
రస్ట్ ఫ్రూఫ్‌తో వస్తుంది. కాబట్టి చాలా రోజులు మన్నికగా ఉంటుంది. హైడ్రాలిక్ డ్రైవ్‌పై ఆధారపడటం వల్ల సొంతంగా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. బ్యాటరీలు వేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ.