ఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. హింసకు పాల్పడుతూ.. అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
#BREAKING Supreme Court directs Andhra Pradesh State Election Commission to take a decision by tomorrow on YSRCP's plea to extend the nomination deadline for Urban Local Body Elections wherever candidates where allegedly prevented from filing nominations due to violence. SC asks APSEC not to publish the final list of candidates today (due date), and to defer it till October 25
— Live Law (@LiveLawIndia) October 21, 2026
ఇలాంటి మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నామినేషన్ల గడువును పొడిగించాలంటూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపటిలోగా (అక్టోబర్ 22) నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
#BREAKING | AP Municipal Polls : #SupremeCourt Asks State Election Commission To Decide On YSCRP Plea To Extend Nomination Deadline The SEC must defer publication of final list of candidates till Oct 25. #YSRCP @YSRCParty @AndhraPradeshCM @ysjagan https://t.co/WRaEBOE07F
— Live Law (@LiveLawIndia) October 21, 2026
అభ్యర్థుల తుది జాబితాను ఈరోజు (గడువు తేదీ) ప్రచురించవద్దని, అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఏపీఎస్ఈసీని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్లు వేయని చోట 48 గంటల సమయం పెంచాలని, అభ్యర్థుల భద్రతకు డీజీపీ అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 27కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
Key observations and directions by Supreme Court: • Free and fair elections form part of the Constitution's basic structure. • Right to participate by filing nominations is a facet of free and fair elections. • Judicial review, though deferential in election matters, cannot be wholly muted. • State Election Commission must examine representations, including electronic evidence, and decide where nomination deadlines require extension. • Where extended, candidates must get at least 48 hours from publication of the decision. • DGP to ensure police protection, CCTV coverage and compliance. • Court seeks compliance reports. Matter on October 27.
— Bar and Bench (@barandbench) October 21, 2026
ఇదిలా ఉండగా.. ఏపీలో MPTC, ZPTC నామినేషన్ల సందడి మొదలైంది. కొన్నిచోట్ల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం హింసాత్మకంగా మారింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వైసీపీ ZPTC అభ్యర్థి భారతి భర్త లక్ష్మారెడ్డిపై దాడి జరిగింది. నరసరావుపేట RDO ఆఫీస్ దగ్గర నామినేషన్ వేసేందుకు వచ్చిన సమయంలో ఆయనపై దాడి చేశారు. లక్ష్మారెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
