సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కోర్ట్ అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్-కం -ప్రోగ్రామర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: కోర్ట్ అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్ – కం – ప్రోగ్రామర్)
మొత్తం ఖాళీలు: 15.
విద్యార్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/ బి.టెక్తోపాటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్సీ పూర్తిచేసి, సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ లేదా బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 2026, అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 3.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 1500, ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 24
అబ్జెక్టివ్ టైప్ టెస్ట్ తేదీ: డిసెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.sci.gov.inను సందర్శించండి.
ఆబ్జెక్టివ్ టెస్ట్
ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. కాంప్రహెన్షన్తో కూడిన జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, రీజనింగ్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో కనీస అర్హత మార్కులు 50 గా నిర్ణయించారు.
