వెండితెరపై మరో బయోపిక్.. సురవరం జీవిత చరిత్రపై సినిమా..

వెండితెరపై మరో బయోపిక్.. సురవరం జీవిత చరిత్రపై సినిమా..

తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, సంపాదకుడు సురవరం ప్రతాప రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘సురవరం’. సురవరం ప్రతాప్ రెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్ నిర్మించిన ఈ చిత్రానికి బి.ఏం.రెడ్డి, జి. హర్షవర్ధన్ రాయల్ దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌‌లో ప్రదర్శించారు.

ముఖ్య​అతిథిగా హాజరైన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీయడం స్ఫూర్తిదాయకం’ అని అన్నారు.  నాటి చరిత్ర తెలుసుకునేందుకు నేటి తరం ఈ సినిమా చూడాలని మరో అతిథి శేఖర్ కమ్ముల అన్నారు. దర్శకనిర్మాతలతో పాటు సురవరం కుటుంబ సభ్యులు డా. సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సురవరం కపిల్, సురవరం గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.