హీరోయిన్గా సురేఖా వాణి కూతురు.. ఇక సిల్వర్ స్క్రీన్పై రచ్చ రచ్చే

హీరోయిన్గా సురేఖా వాణి కూతురు.. ఇక సిల్వర్ స్క్రీన్పై రచ్చ రచ్చే

నటి సురేఖా వాణి(Surekha Vani) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాలా సూపర్ హిట్ సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు సురేఖా వాణి. ఈ క్రమంలో ఆమెకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అయితే సినిమాల్లో హోమ్లీగా కనిపించే ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం పొట్టి పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక ఆమె కూతురు సుప్రీత గురించి ఎంత చెప్పునా తక్కువే.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్నారు.

అయితే సుప్రీత(Supreetha) ఫోటో షూట్స్ చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు హీరోయిన్ మెటీరియల్ మేడం.. ఎందుకు ట్రై చేయడం లేదు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్స్ సుప్రీత గురించి మాట్లాడుతూ.. మీరు సినిమాల్లో నటించండి. మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడాలనేది నా కోరిక.. అంటూ అడిగాడు. దానికి సమాధానంగా సుప్రీత సూన్ అంటూ బదులిచ్చింది. దీంతో త్వరలోనే ఆమె సినిమాలో హీరోయిన్ గా నటించనుంది అనేది అర్థమవుతోంది.

నిజానికి సురేఖా వాణి కూడా సుప్రీతను హీరోయిన్ చేయాలని చూస్తున్నారు. ఇదే విషయాన్నీ చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు సురేఖా వాణి. ఇక సుప్రీత ఇచ్చిన తాజా హింట్ తో.. ఆమె కల త్వరలోనే నెరవేరనుంది అనే విషయం అర్థమవుతోంది. మరి కూతురి ఎంట్రీ కోసం సురేఖా వాణి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుటనున్నారు? ఏ దర్శకుడితో ఆమె మొదటి సినిమా చేయనున్నారు? అది ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.