తల్లీకూతుళ్ల నైట్ పార్టీ..స్టన్ అయ్యే గ్లామర్తో సురేఖావాణి, సుప్రిత

తల్లీకూతుళ్ల నైట్ పార్టీ..స్టన్ అయ్యే గ్లామర్తో  సురేఖావాణి, సుప్రిత

సోషల్ మీడియా పుణ్యమా అని..ఏదీ చేసిన ఇట్టే వైరల్ అయిపోతారు. ఫామ్లో ఉన్న వాళ్ళకైనా..అసలు ఎలాంటి ఫేమ్ లేని వాళ్ళనైనా వైరల్ అయ్యేలా చేస్తోంది ఈ సోషల్ మీడియా.

అలాంటి సోషల్ మీడియాను హీటెక్కించడంలో ముందు వరుసలో ఉంటున్నారు సురేఖావాణి, సుప్రిత. వీరిద్దరూ రెగ్యులర్గా తమ అప్‌డేట్స్ పోస్ట్ చేయడమే కాకుండా రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తున్నారు. 

లేటెస్ట్గా ఓ నైట్ పార్టీలో దిగిన ఈ తల్లీకూతుళ్ల పిక్స్..ఎంజాయ్ చేసిన మూమెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఓ హోటల్ బయట కెమెరా ముందు నిల్చుని ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. వీరిద్దరూ ఒకేరకమైన బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో అందాలను ఆరబోశారు. కుర్రకారును ఫిదా చేశారు. ప్రస్తుతం తల్లీకూతుళ్ల గ్లామర్ డోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

ఇలాంటి గ్లామర్ ఫొటోలతో హీటెక్కించిన సుప్రిత ఎన్నోసార్లు నెటిజన్స్ నుంచి ట్రోల్ల్స్ కు గురైంది. ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఇష్టం అన్నట్లుగా వరుస గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ దూసుకెళ్తోంది. సుప్రిత సెలబ్రెటీ డాటర్ గా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే..తన వరుస ఫొటోస్తో ఫేమ్ తెచ్చుకుంది.