దుల్కర్‌‌‌‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఎక్సయిటింగ్‌‌గా ఉంది : సూర్య

దుల్కర్‌‌‌‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఎక్సయిటింగ్‌‌గా ఉంది  :  సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌‌కు పాన్ ఇండియా రేంజ్‌‌లో అభిమానులు ఉన్నారు. వీరికి తెలుగులోనూ స్టార్ ఇమేజ్ ఉంది. ‘ఆకాశం నీ హద్దురా’  ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని నిజం చేస్తూ గురువారం అధికారికంగా ప్రకటించారు. దర్శకురాలు సుధ  కొంగర, హీరో సూర్య ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

‘బండిల్ ఆఫ్ టాలెంట్స్‌‌తో నా నెక్స్ట్ ప్రాజెక్టు రాబోతోంది’ అని ఆమె ట్వీట్ చేశారు. సుధ డైరెక్షన్‌‌లో మరోసారి నటించడంతో పాటు దుల్కర్‌‌‌‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఎక్సయిటింగ్‌‌గా ఉందని సూర్య పోస్ట్ చేశాడు. నజ్రియా హీరోయిన్‌‌గా నటిస్తుంటే, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు.  తమ హోం బ్యానర్ 2డీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సూర్య, జ్యోతిక. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌‌మెంట్ వీడియోలో ఖాళీ సీసా, టేప్‌‌ రికార్డర్‌‌, మైక్‌‌, మంటలు, గన్ లాంటి డిఫరెంట్‌‌ ప్రాపర్టీస్‌‌ను చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.  ఇది జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న 100వ సినిమా.