రూ. 300 కోట్ల క్లబ్‌లో 'కరుప్పు'.. కెమెరామెన్‌కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన హీరో సూర్య!

రూ. 300 కోట్ల క్లబ్‌లో 'కరుప్పు'.. కెమెరామెన్‌కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన హీరో సూర్య!

సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే వచ్చే కిక్కే వేరు. సక్సెస్ ఉన్నప్పుడే ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిస్తేనే హీరోల మార్కెట్ పీక్స్‌కు వెళ్తుంది. లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాన్నాళ్ల తర్వాత అలాంటి సాలిడ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో సూర్య ఆనందానికి అవధులు లేవు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట..

తెలుగులో ఈ చిత్రాన్ని ‘వీరభద్రుడు’ పేరుతో రిలీజ్ చేశారు. మన దగ్గర ఆశించిన స్థాయిలో టాక్ రాకపోయినప్పటికీ, కలెక్షన్స్ పర్లేదనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య ఖాతాలో పడిన ఈ క్రేజీ హిట్ ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టిస్తోంది. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

టెక్నీషియన్‌కు లగ్జరీ కార్ గిఫ్ట్

సినిమాకు భారీ వసూళ్లు వస్తుండటంతో, సూర్య తన చిత్ర యూనిట్‌కు ఖరీదైన బహుమతులు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన క్రేజీ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు (GK Vishnu)కు దాదాపు రూ. 30- నుంచి 40 లక్షల విలువైన మహీంద్ర బీ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి షాక్ ఇచ్చాడు. గతంలో ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘జవాన్’ వంటి ఇండస్ట్రీ హిట్లకు కెమెరామెన్‌గా పనిచేసిన జీకే విష్ణు, ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇదంతా దేవుడి దయ. థాంక్యూ సూర్య సార్. మీకు చాలా పెద్ద మనసు ఉంది అంటూ కారు ఫోటోను పోస్ట్ చేశాడు.

►ALSO READ | అప్పట్లో నెల జీతం రూ. 275.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.250 కోట్లు.. తలైవర్ పాత ఐడీ కార్డ్ వైరల్!

దర్శకుడికి ఎలాంటి కార్ ఇస్తారో?

సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన టెక్నీషియన్లను సూర్య గౌరవిస్తున్న తీరుపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే కేవలం సినిమాటోగ్రాఫర్‌కే ఇంత లగ్జరీ కారు ఇస్తే.. మరి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్‌జే బాలాజీకి సూర్య ఎలాంటి క్రేజీ కార్ గిఫ్ట్‌గా ఇస్తాడో చూడాలని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా 'కరుప్పు' సక్సెస్ జోష్ కోలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.