కంగువ షూట్ కంప్లీట్.. ఇక బాక్సాఫీస్ వేట మొదలు

కంగువ షూట్ కంప్లీట్.. ఇక బాక్సాఫీస్ వేట మొదలు

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య(Suriya).. ప్రస్తుతం కంగువ(Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ సినిమాపై అంచనాలు పెంచాయి.  ఈ క్రమంలో సినిమా గురించి ఓ అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చాడు హీరో సూర్య.

ఈ సినిమాకు సంబంధించి తన షూటింగ్ పార్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తయిందని, యూనిట్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఎంతో పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. షూటింగ్‌‌‌‌‌‌‌‌ మెమొరీస్‌‌‌‌‌‌‌‌ ఎన్నో ఉన్నాయని, టీమ్ అందరినీ మిస్‌‌‌‌‌‌‌‌ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సూర్య కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 42వ చిత్రం. తనకు జంటగా దిశాపటానీ నటిస్తుండగా బాబీడియోల్ కీ రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. త్రీడీ ఫార్మట్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సుధా కొంగర దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు సూర్య. దర్శకుడు శంకర్ కూతురు అదితి ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘కంగువ’ షూటింగ్ పూర్తయింది కనుక ఇక ఈ సినిమాపై సూర్య పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు.