సూర్య యాక్షన్ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సూర్య యాక్షన్ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొంతకాలం క్రితం వరకు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు చేశాడు సూర్య. వరుస ఫెయిల్యూర్స్ రావడంతో రూటు మార్చాడు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి 
క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విజయాలు సాధించాడు. ఇలాంటి సినిమాలు చేస్తే సూర్యనే చేయాలి అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మారాడు సూర్య. పాండిరాజ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ‘ఎదర్కుమ్ తుణీందవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈటీ)’ చిత్రంలో మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు. మార్చ్ 10న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిన్న వదిలారు. ఇందులో రకరకాల షేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కనిపిస్తున్నాడు సూర్య. ఓసారి లుంగీ కట్టుకుని పల్లెటూరివాడిలా ఉన్నాడు. మరోసారి సిటీ కుర్రాడిలా మోడర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించాడు. గెటప్ ఏదైనా శత్రువుల్ని మాత్రం రఫ్పాడిస్తున్నాడు. సైకో విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయ్​తో తలపడుతున్నాడు. ‘నాతో ఉన్నవాళ్లెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ ఏమీ చేయలేరు’ అనడాన్ని బట్టి ఏదో సమస్య నుంచి అందరినీ కాపాడతాడని అనిపిస్తోంది. కాన్సెప్ట్ ఏదైనా.. ఈ కాస్త వీడియోతోనే మెస్మరైజ్ చేసిన సూర్య, థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంకెంత ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తాడో.