మమ్ముట్టి,జ్యోతిక సినిమాపై..ప్రశంసలు కురిపించిన హీరో సూర్య

మమ్ముట్టి,జ్యోతిక సినిమాపై..ప్రశంసలు కురిపించిన హీరో సూర్య

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ కాథల్-ది కోర్‌ (Kadal The Core). ఈ సినిమాలో మమ్ముట్టికి జోడిగా జ్యోతిక(jyothika) నటించింది. జో బేబి డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 23న వరల్డ్ వైడ్గా థియేటర్ల లో గ్రాండ్‌ గా రిలీజయింది. ఈ సినిమాకు ఆడియాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు..చాలా గొప్ప సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. 

లేటెస్ట్ గా సినిమా చూసిన హీరో సూర్య తన ఇంస్టాగ్రామ్ లో కాథల్-ది కోర్‌ మూవీపై ప్రశంసలు కురిపించాడు. అందమైన ఆలోచనలు కలిసి వస్తే మనకు కాథల్ ది కోర్ లాంటి సినిమాలు పుట్టుకొస్తాయని తెలిపారు. అలాగే, మంచి సినిమా పట్ల మమ్ముట్టి సార్ చూపించే ప్రేమ,గౌరవం,ఆయనిచ్చే స్ఫూర్తి ఎంతో అద్భుతం. ఇంత చక్కటి మెసేజ్ తో నిండి ఉన్న..ఈ అందమైన సినిమాను అందించిన మమ్ముట్టి సార్ టీంకు నా హ్యాట్సాఫ్‌. 

ఈ సినిమాలో ముఖ్యంగా నిశ్శబ్ద సన్నివేశాలు కూడా..విలువల గురించి మాట్లాడతాయి. మాకు ఈ ప్రపంచాన్ని చూపించిన రైటర్స్‌ ఆదర్శ్‌ సుకుమారన్ అండ్ పౌల్సన్‌ స్కేరియాకు బెస్ట్ విషెష్ అంటూ తెలిపారు. ఇక చివర్లో..నా ప్రియమైన జ్యోతిక తన ప్రేమ తో అందరి హృదయాలను మరోసారి గెలుచుకుందని..సూర్య ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో రాసుకొచ్చారు. కాగా..హీరో సూర్య చేసిన పోస్ట్ పై మెగాస్టార్ మమ్ముట్టి స్పందిస్తూ..థాంక్యూ సూర్య సార్..అని ట్వీట్ చేశారు. 

మరో టాప్ సెలబ్రెటీ..టాలీవుడ్ బ్యూటీ సమంత కాథల్-ది కోర్‌ పై తన అభిప్రాయాన్ని తెలిపింది. ఈ ఏడాదిలో చూసిన ఉత్తమ చిత్రంమీదేనని తన ఫీలింగ్ తెలియజేసింది. ఈ మూవీలో తన ఫేవరేట్ హీరో మమ్ముట్టి నటన ఎప్పటికీ గుర్తిండిపోతుందని సమంత ప్రశంసలు కురిపించింది.