Vishwanath And Sons Box office: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ జోరు.. ఫ్యామిలీ డ్రామా తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Vishwanath And Sons Box office: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ జోరు.. ఫ్యామిలీ డ్రామా తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఇటీవల 'కరుప్పు' మూవీ మంచి బ్లాక్ బస్టస్ట్ ఇచ్చింది. ఇప్పుడు అదే జోష్ ను ఇస్తోంది 'విశ్వనాథ్ అండ్ సన్స్' . భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమాకు తొలి రోజే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ సినిమాల తర్వాత పూర్తిగా క్లాస్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య.. ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతున్నాడు. 

అంచనాలను తలకిందులు చేస్తూ...

సూర్య, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. 'కురుప్పు' తరహా మాస్ యాక్షన్ చిత్రం కాకపోవడంతో బుకింగ్స్ పై కొంత ప్రభావం ఉండొచ్చని తొలుత పలువురు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అటు వరుస సెలవులు రావడం ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది

తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

తొలి రోజు వసూళ్ల విషయంలోనూ సినిమా సత్తా చూపించింది.  ట్రేడ్ అంచనాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.33.-34 కోట్ల గ్రాస్‌ దాకా వసూళ్లు సాధించినట్లు సమాచారం. అడ్వాన్స్ బుకింగ్స్‌ నుంచే సినిమాపై ఉన్న క్రేజ్ స్పష్టమైంది. విడుదలకు ముందే భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్, రూ.7 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్లు నివేదికలు వచ్చాయి. 

అంతర్జాతీయ షూటర్‌గా విజయాన్ని వెంబడించే సంజయ్ విశ్వనాథ్ జీవితంలో కుటుంబ బాధ్యతలు, వయసు, ప్రేమ, వ్యక్తిగత ఆశయాలు ఎదురుపడే కథాంశంతో సినిమా సాగుతుంది. యాక్షన్ కంటే భావోద్వేగాలకు పెద్దపీట వేయడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించగా.. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి, నాజర్ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

బ్రేక్‌ఈవెన్ దిశగా..

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆదరణ దక్కుతుండటం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. 'కరుప్పు' విజయంతో వచ్చిన పాజిటివ్ బజ్‌కు తోడు వెంకీ అట్లూరి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా మలచడం సినిమాకు ప్లస్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగితే బ్రేక్‌ఈవెన్ దిశగా ఈ సినిమా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్‌తో మాత్రమే కాదు, క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోనూ థియేటర్లను షేక్ చేయగలనని సూర్య మరోసారి నిరూపిస్తున్నాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..