సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను విడుదల

సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను విడుదల

వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది క్యాప్షన్. ‘పేపర్ బాయ్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ జయశంకర్ దర్శకుడు. శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా  లీడ్ రోల్ చేస్తున్న సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు. సుమన్, ఆమని, శ్రీనివాస రెడ్డి, శుభలేఖ సుధాకర్, గాయత్రి భార్గవి, వైవా హర్ష, చమ్మక్ చంద్ర, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం ఇతర పాత్రలు పోషిస్తున్నారు.