732 రన్స్తో టాప్ స్కోరర్గా సూర్య

732 రన్స్తో టాప్ స్కోరర్గా సూర్య

న్యూఢిల్లీ: ఇండియా బెస్ట్‌‌‌‌‌‌‌‌ టీ20 బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ ఖ్యాతి పెరుగుతూనే ఉంది. కాస్త ఆలస్యంగా జట్టులోకి వచ్చిన సూర్య ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాడు. ప్రతీ సిరీస్‌‌‌‌‌‌‌‌లో పరుగుల మోత మోగిస్తున్న తను ఓ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తరఫున టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాదిలో సూర్య  ఇప్పటికే 732 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాంతో, 2018లో 689 రన్స్‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్న శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో, సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ కొట్టిన సూర్య.. తన టీ20 కెరీర్‌‌‌‌‌‌‌‌లో 1000 పరుగుల మైలురాయి దాటేందుకు మరో 24 రన్స్‌‌‌‌‌‌‌‌ దూరంలో ఉన్నాడు.