రీ ఎంట్రీకి రెడీ

రీ ఎంట్రీకి రెడీ

విశ్వసుందరి కిరీటాన్ని అందుకుని, ఆ ఇమేజ్‌‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సుస్మితాసేన్. చాలా సినిమాలే చేసింది.‘రక్షకుడు’ సినిమాతో సౌత్‌‌ వారికీ పరిచయమయ్యింది. ‘షకలక బేబీ’ అంటూ ‘ఒకే ఒక్కడు’లో తన డ్యాన్స్‌‌ తోనూ మురిపించింది. అయితే నటిగా ఆమెది సక్సెస్‌‌ఫుల్ కెరీర్ కాదనే చెప్పాలి. బ్లాక్ బస్టర్స్  కొట్టలేదు. టాప్ హీరోయిన్ల లిస్టులోనూ చేరలేదు. అక్కడక్కడా కొన్ని హిట్స్ ఉన్నా వాటి క్రెడిట్​ ఆమె ఖాతాలో పడలేదు. దాంతో మెల్ల మెల్లగా నటనకు దూరమైంది.  పదేళ్ల తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఓ ప్రెస్టీజియస్‌‌ ప్రాజెక్ట్‌‌లో కీలక పాత్ర పోషిస్తోందట. అదేంటో చెప్పడానికి మాత్రం కాస్త టైమ్ ఉందంటోంది. మరి ఆమె సెకెండ్ ఇన్నింగ్సయినా సక్సెస్‌‌ఫుల్‌‌గా సాగుతుందేమో చూడాలి.