ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) అనుమానిత  ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జమాతో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న  మహ్మద్ పై రూ.  3 లక్షల రివార్డు  ఉంది.  ఢిల్లీలోని ఐఎస్‌ఐఎస్‌ మాడ్యూల్‌ పక్కా సమాచారంతో వెల్లడికావడంతో అరెస్ట్‌ చేశారు. 

ఈ ఉగ్రవాదులు దేశ రాజధానిలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా ఉగ్రవాద లింకులున్న  వ్యక్తులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసుల విభాగం ఎన్ఐఏతో కలిసి పనిచేస్తుంది.  వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన షానవాజ్‌ పూణె ఐసిస్‌ కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు . 

అతను ఢిల్లీ నివాసి మరియు పూణే పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షానవాజ్‌తో సహా ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.