ముంబై: నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలున్న వ్యక్తిని ముంబైలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు అతనిపై కేసు నమోదైంది. నిందితుడిని ముంబైలోని మహీమ్‌కు చెందిన మొహమ్మద్ హసన్ అబు సర్మద్ అక్తర్‌గా గుర్తించారు. ఉగ్రభావజాలాన్ని ప్రచారం చేయడానికి అక్తర్ రాపిడో డ్రైవర్, అత్తరు వ్యాపారి అవతారం ఎత్తినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
అతడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలింది. టెలిగ్రామ్‌లోని ‘ఇండియన్ ముస్లిం’ అనే గ్రూప్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంతో పాటు బాబ్రీ మసీదుకు సంబంధించి జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఉగ్రవాద ఆడియో క్లిప్‌లను షేర్ చేశాడు.
పాకిస్తాన్‌కు చెందిన ఐబీఎన్ఈ ఖాసిమ్అనే రాడికల్ టెలిగ్రామ్ ఛానెల్‌కు కూడా అతడు సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎక్స్, ఇన్‌స్టాలలో అక్తర్ పదేపదే రెచ్చగొట్టే కామెంట్లు చేశాడు. ఇటీవల ముంబైలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపంపై చర్చించే పోస్టుపై స్పందిస్తూ భాయ్ లోగ్.. ఇందిరాగాంధీకి చేసినట్లే మోదీకి కూడా ఏదో ఒకటి చేయాలి అంటూ పరోక్షంగా హత్యకు పాల్పడాలనే అర్థంతో కామెంట్ చేశాడు.
