హోటల్ లో ‘కాంచన 3’ హీరోయిన్ అనుమానాస్పద మృతి

హోటల్ లో ‘కాంచన 3’ హీరోయిన్ అనుమానాస్పద మృతి

రష్యన్ యువ నటి, కాంచన మూవీ హీరోయిన్ అలెగ్జాండ్రా జావి (24) ఆత్మహత్య చేసుకుంది. గోవాలో తానుంటున్న హోటల్ లోనే ఆమె శవమై కనిపించింది. జావి ‘కాంచన 3’ సినిమాలో రాఘవ లారెన్స్ తో కలిసి నటించింది. అయితే ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె నిజంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా ఆమెను చంపారా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. 

అయితే, ఆమె సన్నిహితులు ప్రకారం.. అలెగ్జాండ్రా జావి ప్రేమలో విఫలమైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన ప్రియుడితో గొడవపడి విడిపోయినట్లు సమాచారం. ఆ కారణంతోనే ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

జావిపై 2019లో ఓ కేసు నమోదైంది. చెన్నై ఫోటోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో.. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలెగ్జాండ్రా మరణవార్త ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. కాంచన 3 సినిమాలో ప్రతీకారం తీర్చుకునే దెయ్యం పాత్రలో అలెగ్జాండ్రా జావి తన నటనతో అందరినీ మెప్పించారు.