Sohel: పైసల్లేవు పబ్లిసిటీకి..నా సినిమా చూడండి..మోకాళ్ళపై పడి ఆడియన్స్ను అర్ధించిన సోహైల్

Sohel: పైసల్లేవు పబ్లిసిటీకి..నా సినిమా చూడండి..మోకాళ్ళపై పడి ఆడియన్స్ను అర్ధించిన సోహైల్

సయ్యద్ సోహెల్, మేఘ లేఖ జంటగా శ్రీ కోనేటి దర్శకత్వంలో  ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘బూట్‌‌ కట్ బాలరాజు(Bootcut Balaraju)’.  సునీల్,  సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బూట్‌‌ కట్ బాలరాజు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ కనకాల, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సోహెల్(Sohel) మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఫిబ్రవరి 2న థియేటర్స్లో బూట్ కట్ బాలరాజు మూవీని అందరూ చూడాలి. నా దగ్గర పైసల్లేవు పబ్లిసిటీకి. దయ చేసి నా సినిమా చూడండి..అంటూ మోకాళ్ళపై పడి ప్రేక్షకులను అర్దించారు.

అలాగే ఈ సినిమా నిర్మాణంలో ఎదుర్కొన్న సమస్యలు చెబుతూ..'పాషా లాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా సినిమా చేసుకున్న పుణ్యం. సినిమా ముందుకు నడిపించడంలో ఆయనకున్న ప్యాషన్ మా అదృష్టం, పాషా మధ్య తరగతి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తో చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని నిర్మించారు. అయితే..ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే..దాదాపు యాభై శాతం కంప్లీట్ చేసుకున్న తర్వాత..పాషాకు ఫైనాన్సియల్ గా కొంత ఇబ్బంది ఎదురవ్వడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యారు, అపుడు ఆయన్ని ఒత్తిడి తీసుకోవద్దని ధైర్యం చెప్పా. అంతేకాకుండా..అప్పుడే నాన్న రిటైర్మెంట్ డబ్బులు, నేను సంపాదించిన పైసలు, ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి అన్నీ బూట్‌‌ కట్ బాలరాజు సినిమాకి పెట్టాను. అపుడు అర్ధమైంది నిర్మాతల కష్టాలు మరింత ఏంటనేవి.

నిర్మాత దిల్ రాజుకి మా పరిస్థితి చెప్పగా ఆయన చాలా గొప్ప మనసుతో నైజాం నేను చూసుకుంటా, మీరు ఒత్తిడి తీసుకోవద్దని చెప్పారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు. బిగ్ బాస్ లో వునప్పుడు నా ఒరిజినాలిటీ చూసి ప్రేక్షకులు ప్రోత్సహించారు. బూట్ కట్ బాలరాజుని కూడా అలానే థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు, సినిమాకి వెళ్ళండి చాలా ఫన్ ఎమోషన్ ఉంటుంది. మనం జీవితంలో ఓడిన గెలిచినా ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు. అదే ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించామన్నారు.

ఈ సినిమాకి ధమాకా,బలగం చిత్రాలకు మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మంచి ఆల్బమ్ కంపోజ్ చేశారు. ‘బిగ్‌‌బాస్’ షోతో గుర్తింపు తెచ్చుకుని, వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు సయ్యద్ సోహెల్. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు.