
OTTల హవా పెరిగాక థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. అందుకే మేకర్స్ అలాంటి కాన్సెప్ట్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఆడియన్స్ కూడా కథ, కథనాలు నార్మల్ గా ఉంటే పెద్దగా ఇష్టపడటంలేదు. వారు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. అందులో భాగంగా వచ్చిన లేటెస్ట్ మూవీనే పోలీసోడు(తానక్కరన్). 2022లో వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ ఓటీటీలో రిలీజై మంచి విజయం సాధించింది. విక్రమ్ ప్రభు, అంజలి నాయర్, లాల్, మధుసూదన్, బోస్ వెంకట్, ఎం ఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాను దర్శకుడు తమిళ్ తెరకెక్కించారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సినిమా అంతా పోలీస్ అవుదాం అనుకున్న ఒక యువకుడి గురించి ఉంటుంది. చివరి వరకు చాలా సస్పెన్స్ గా సాగే ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీలుంటే మీరు కూడా ఈ వీకెండ్ చూసేయండి.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ అవుదాం అనుకునే ఒక యువకుడు పరీక్షలు పాస్ అయ్యి ఆరు నెలల ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ సెంటర్ కు వస్తాడు. అక్కడ అతనికి ఎదురైనా సంఘటనలు, వాటిని అతను ఎలా అధిగమించాడు, చివరికి ఎలా పోలీస్ అయ్యాడు అనేదానిపై మిగిలిన కథ సాగుతుంది. ఈ నేపధ్యంలో వచ్చే సీన్స్ థ్రిల్ ను పంచుతాయి.