తెలుగు సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం వరుస హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తను నటించిన చివరి తెలుగు సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ 2021లో వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తాప్సీ నటించనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇదొక హారర్ మూవీ అని, దీనికోసం తాప్సీని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సాధారణ కమర్షియల్ మూవీకి భిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పాటలు, కామెడీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రయోగాత్మకంగా కథను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
