చిన్న వయసులో ప్రేమ, అంతలోనే బ్రేకప్.. తన లవ్ స్టోరీ చెప్పిన తాప్సి

చిన్న వయసులో ప్రేమ, అంతలోనే బ్రేకప్.. తన లవ్ స్టోరీ చెప్పిన తాప్సి

తాప్సీ పన్ను(Taapsee Pannu).. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన గ్లామర్ తో కుర్రకారు గుండెల్ని పిండేసింది ఈ బ్యూటీ. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తాప్సీ.. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు కానీ.. అంతగా సక్సెస్ అవలేకపోయారు తాప్సీ. దీంతో హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో అవకాశాల కోసం టాలీవుడ్ కు బై చెప్పేసింది.

దాంతో బాలీవుడ్ నుండి వరుస ఆఫర్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ డంకి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను.. సక్సెస్ ఫుల్ డైరెక్షర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ మూవీ. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తాప్సి. ఇందులో భాగంగా ఆమె తన లవ్ గురించి చెప్పుకొచ్చారు. 

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించాను. అది కూడా 10వ తరగతి చదువుతున్న మా సీనియర్ తో. మొదట్లో అతను కూడా నాపై ఆసక్తి చూపించాడు కానీ.. తరువాత చదువు పాడై పోతుందని ఉద్దేశంతో నా నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రేమ, పెళ్లి వంటివి కాకుండా చదువుపై శ్రద్ధ పెట్టమని నాకు చెప్పాడు.. అంటూ తన తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చారు తాప్సి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.