Taapsee Pannu : హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే హీరోలకు భయం.. తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు.

Taapsee Pannu : హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే హీరోలకు భయం.. తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చు కున్న హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. ఈ బ్యూటీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పురుషాధిక్యతపై చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి . కథానాయికలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడా నికి అగ్రహీరోలు సైతం వెనకాడుతుంటారని ఆమె చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

హీరోయిన్ ఓరింటెడ్ సినిమా అంటే..

ముఖ్యంగా ఒక చిత్రంలో తాను డబుల్ రోల్ చేస్తున్న టైంలో జరిగిన చేదు అనుభవాన్ని తాప్సీ పంచుకుంది. ఆ సినిమాలో హీరో పాత్ర కోసం మేకర్స్ ఒక ప్రముఖ స్టార్ ను సంప్రదించారు. అయితే ఆ హీరో ఒప్పుకోలేదు. హీరోయిన్ కు ఎక్కువ మార్కులు పడతాయనే అభద్రతా భావంతో ఆయన ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడరని చెప్పుకొచ్చింది.  నిజానికి ఆ హీరో నాతో అంతకుముందే ఒక మూవీలో నటించాడరని తెలిపింది.

కుర్ర హీరోలు సైతం పక్కకు..

అయితే కేవలం పాత్ర నిడివి, ప్రాధాన్యత విషయంలో భయపడి సదరు హీరో వెనక్కి తగ్గడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించింది తాప్సీ.  కేవలం పెద్ద స్టార్లే కాదు, ఇండస్ట్రీలోకి వచ్చి ఒకటి రెండు సినిమాలు చేసిన కుర్ర హీరోలు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించేందుకు ఇష్టపడటం లేదు అంటూ చెప్పుకొచ్చింది..

ప్రస్తుతం తాప్సీ పన్ను  నటిస్తున్న యాక్షన్ చిత్రం 'గాంధారి' నిర్మాణ దశలో ఉంది. ఇక 'వో లడ్కీ హై కహాన్' లో ప్రతీక్ గాంధీతో కలిసి నటిస్తుంది. వరుస సినిమాలతో షూటింగ్ లో ఉన్నా.. నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ తన అభిప్రాయలను అభిమానులతో పంచుకుంటూ.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ.