ఆధ్యాత్మిక సేవలో తమన్నా.. కామాక్య ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆధ్యాత్మిక సేవలో తమన్నా.. కామాక్య ఆలయంలో ప్రత్యేక పూజలు

సౌత్ హీరోయిన్ తమన్నా(Thamanna) ఆధ్యాత్మిక సేవలో పాల్గొన్నారు. గౌహతిలోని ప్రఖ్యాత కామాక్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమన్నా కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. నిజానికి తమన్నాకి  భగవంతుని పట్ల అపారమైన నమ్మకం, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తరచు దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు తమన్నా. తాజాగా గౌహతిలోని కామాక్య ఆలయాన్ని సందర్శించారు.

ఈ విషయాన్ని తమన్నా స్వయంగా తన సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో పసుపు రంగు చుడీదార్, మెడలో హారంతో, శాలువా, నుదుటిపై కుంకుమతో చాలా ట్రెడిషన్ గా కనిపించారు. ప్రియమైన వారితో మధురమైన క్షణాలని గడిపాను..  అంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాలతోపాటు.. హిందీలో ఒక సినిమా చేస్తున్నారు. వాటిలో అరుణమని, వేద, స్ట్రీ2, భోలే చూడియన్, పోన్ ఒండ్రు కందెన సినిమాలున్నాయి.