Tamannaah Bhatia: తమన్నా ప్రత్యేక పూజలు..పెళ్లెప్పుడంటే?

Tamannaah Bhatia: తమన్నా ప్రత్యేక పూజలు..పెళ్లెప్పుడంటే?

టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతోందట. గత ఏడాది విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించారు. ఈ సిరీస్ ద్వారా ఏర్పడిన ఆ పరిచయమే ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. 

ఓ పార్టీలో తమన్నా, విజయ్ కిస్సింగ్ ఫొటోస్ లీక్ అయ్యాయి. దీంతో అడ్డంగా దొరికిపోయామని భావించిన వీళ్లిద్దరూ తాము ప్రేమలో ఉన్నట్టు అనౌన్స్ చేసేశారు. నిన్న మొన్నటి వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేసిన తమన్నా తాజాగా దైవ చింతనలో పడిపోయింది. వరుసగా దేవాలయాలను సందర్శిస్తోంది.

ముఖ్యంగా తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అందుకే తమన్నా ఇటీవల కుటుంబ సభ్యులతో పాటు గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు కూడా చేసేసింది. దీంతో మళ్లీ పెళ్లిపై వార్తలు ఊపందుకున్నాయి..ఈ ఏడాదిలోనే పెళ్లి అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఆ తేదీ ఎప్పుడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.!

ప్రస్తుతం తమన్నా తెలుగులో ఏ సినిమా చేయడం లేదు. తమిళంలో కూడా ఒక ప్రాజెక్టు మాత్రమే ఉంది. అయితే ఆ మధ్య వచ్చిన రజినీ జైలర్ లోని ‘కావాలయ్యా’ పాట మాత్రం ఒక ఊపు ఊపింది. విజయ్ వర్మ సూర్య 43 లో నటిస్తున్నారు.