అందం, అభినయంతో రెండు దశాబ్ధాలుగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. కేవలం వెండి తెరపైన మాత్రమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా లక్మే ఫ్యాషన్ వీక్ వేదికగా ఈ బ్యూటీ ధరించిన పింక్ డిజైనర్ దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటోలోని మెరుపులు నె టిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ భూమిక శర్మ రూ పొందించిన ఆఫ్టర్ గ్లో కలెక్షన్ లో భాగంగా ఈ పింక్ కలర్ మోడ్రన్ లెహంగాలో తమన్నా మెరిసింది. పింక్ లెహంగాపై చేసిన సునిశితమైన ఎంబ్రాయిడరీ వర్క్. . జతగా ఎంపిక చేసుకున్న మోడ్రన్ బ్లౌజ్ ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఆధునికత, సంప్రదాయం కలగలిసిన ఈ లెహంగాలో ఎంతో హుందాగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయాని కొస్తే.. వయసు పెరుగుతున్నా.. తన గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గత 20 ఏళ్లుగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. పురుషన్, ఓ రోమియో, రేంజర్ చిత్రాల్లో నటిస్తోంది. వివాన్- ఫోర్స్ ఆఫ్ ది పారెస్ట్ షూటింగ్ దశలో ఉంది. నెట్ ఫ్లెక్స్, హాట్ స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థల కోసం కొన్ని వెబ్ ఒరిజినల్స్ లో నటించనున్నట్లు సమాచారం.
